తెలుగు ప్రజలకు సినిమా అన్నది అతి పెద్ద వినోదం, ఉద్వేగం, ఉత్సాహం, చైతన్యం..దశాబ్దాలుగా సినిమా తెలుగు ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయింది..సినిమాకు చెందిన ప్రతి చిన్న జ్ఞాపకం ఒక అధ్బుతమే..మరపురాని ఆ మధురానుభూతుల్ని మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుందాం..ఆ జ్ఞాపకాల అలలలో ఓలలాడుదాము..!
19, జూన్ 2025, గురువారం
Mabbe Masakesindile Song Lyrics - మబ్బే..మసకేసిందిలే - వయసు పిలిచింది (1978 )
చిత్రం : వయసు పిలిచింది (1978 )
5, జనవరి 2025, ఆదివారం
ఎదుట నీవే..ఎదలోన నీవే (అభినందన ) : Eduta Neeve Song Lyrics Telugu - Abhinandana ( 1987)
చిత్రం : అభినందన (
1987 )
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఎస్పీ బాల
సుబ్రహ్మణ్యం
సంగీతం : ఇళయరాజా
పల్లవి:
ఎదుటా.. నీవే.. ఎదలోనా నీవే
ఎదుటా.. నీవే.. ఎదలోనా నీవే
ఎటు చూస్తే.. అటు నీవే.. మరుగైనా కావే
ఎదుటా.. నీవే.. ఎదలోనా నీవే
చరణం 1:
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం.. అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం.. అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు.. హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు.. మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాడ్ని కానీదు.. ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ...
ఎదుటా.. నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా.. నీవే.. ఎదలోనా నీవే
చరణం 2:
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను.. వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను.. వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా..సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యం ఐతే వింత.. సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా.. ఆహహా ఓహోహో ఊఁహుఁహుఁ ఊఁహూఁహూ...
ఎదుటా.. నీవే..ఎదలోనా నీవే
ఎటు చూస్తే.. అటు నీవే.. మరుగైనా కావే
ఎదుటా.. నీవే.. ఎదలోనా నీవే
-
చిత్రం : శుభాకాంక్షలు ( 1997) సాహిత్యం : సిరివెన్నెల గానం : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం : కోటి గుండె నిండా గుడి గంటలు.. గువ్వల గొంతులు.....
-
చిత్రం : వయసు పిలిచింది (1978 ) సాహిత్యం : వేటూరి గానం : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీతం : ఇళయరాజా హే ..ముత్యమల్లే.. మెరిసేపోయే మల్లె మొగ్...
-
రీ-రిలీజ్ ట్రెండ్ అంటే ఏమిటి? తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్)లో రీ-రిలీజ్ ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా బాగా ప్రాచుర్యం పొందింది మరియు 20...