12, జులై 2025, శనివారం

గుండె నిండా గుడి గంటలు.. గువ్వల గొంతులు - Gundeninda Gudigantalu Song Lyrics - Subhakankshalu (1997) Jagapathibabu

చిత్రం : శుభాకాంక్షలు ( 1997)

సాహిత్యం : సిరివెన్నెల 

గానం : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 

సంగీతం : కోటి 

గుండె నిండా గుడి గంటలు.. గువ్వల గొంతులు.. ఎన్నో మ్రోగుతుంటే.. 

కళ్ళ నిండా సంక్రాంతులు.. సంధ్యా  కాంతులు.. శుభాకాంక్షలంటే.. 

వెంటనే పోల్చాను.. నీ చిరునామా ప్రేమా..

గుండె నిండా గుడి గంటలు.. గువ్వల గొంతులు.. ఎన్నో మ్రోగుతుంటే.. 

కళ్ళ నిండా సంక్రాంతులు.. సంధ్యా  కాంతులు.. శుభాకాంక్షలంటే.. 

చూస్తూనే.. మనసు వెళ్లి.. నీ వొళ్ళో వాలాగా ..

నిలువెల్లా.. మారిపొయానే.. నీ నీడగా..

నిలువదు నిముషం.. నువ్వు ఎదురుంటె..

కదలదు సమయం..  కనబడకుంటే.. 

నువ్వొస్తునే ఇంద్రజాలం చేశావమ్మా.. 

కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా.. 

పరిచయమే.. చేసావే.. నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమా.. 

గుండె నిండా గుడి గంటలు.. గువ్వల గొంతులు.. ఎన్నో మ్రోగుతుంటే.. 

కళ్ళ నిండా సంక్రాంతులు.. సంధ్యా  కాంతులు.. శుభాకాంక్షలంటే.. 

నీ పేరే కలవరించే నాలోని ఆశలు 

మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు 

తెరిచిన కనులే.. కళలకు నెలవై జూమ్ జూమ్ జూమ్ 

కదలని పెదవే.. కవితలు చదివే 

ఎన్నెన్నెన్నో గాధలున్న నీ భాషనీ 

ఉన్నట్టుండి నేర్పినవే ఈ రోజుని 

నీ జతలో  క్షణమైనా బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా 

గుండె నిండా గుడి గంటలు.. గువ్వల గొంతులు.. ఎన్నో మ్రోగుతుంటే.. 

కళ్ళ నిండా సంక్రాంతులు.. సంధ్యా  కాంతులు.. శుభాకాంక్షలంటే.. 

వెంటనే పోల్చాను.. నీ చిరునామా ప్రేమా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి