చిత్రం : అభినందన (
1987 )
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఎస్పీ బాల
సుబ్రహ్మణ్యం
సంగీతం : ఇళయరాజా
పల్లవి:
లాలల లలాలాల
ప్రేమ లేదని..
ప్రేమించరాదని
ప్రేమ లేదని..
ప్రేమించరాదని
సాక్ష్యమే
నీవనీ.. నన్ను నేడు చాటని
ఓ ప్రియా..
జోహారులు ...
ప్రేమ లేదని..
ప్రేమించరాదని
ప్రేమ లేదని..
ప్రేమించరాదని
సాక్ష్యమే
నీవనీ.. నన్ను నేడు చాటని
ఓ ప్రియా..
జోహారులు
చరణం 1:
మనసు మాసిపోతే
మనిషే కాదని
కఠికరాయికైనా
కన్నీరుందని
వలపు చిచ్చు
రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన
మనసు తలుపు తట్టి చెప్పని
ముసురు గప్పి
మూగబోయి నీ ఉంటివి
ముసురు గప్పి
మూగబోయి నీ ఉంటివి
మోడువారి నీడ
తోడు లేకుంటినీ
ప్రేమ లేదని
లలలాలలాల
చరణం 2:
గురుతు చెరిపివేసి
జీవించాలని
చెరపలేకపోతే
మరణించాలని
తెలిసికూడ
చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలి పోవు
వరకు నన్ను పాడని
ముక్కలలో
లెక్కలేని రూపాలలో
ముక్కలలో
లెక్కలేని రూపాలలో
మరల మరల
నిన్ను చూసి రోదించనీ
ప్రేమ లేదని..
ప్రేమించరాదని
ప్రేమ లేదని..
ప్రేమించరాదని
సాక్ష్యమే
నీవనీ.. నన్ను నేడు చాటని
ఓ ప్రియా
జోహారులు
లాలల లలాలాల
లాలల లలాలాల