19, జూన్ 2025, గురువారం

Mabbe Masakesindile Song Lyrics - మబ్బే..మసకేసిందిలే - వయసు పిలిచింది (1978 )

 

చిత్రం : వయసు పిలిచింది (1978 )
సాహిత్యం : వేటూరి 
గానం : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
సంగీతం : ఇళయరాజా 








హే ..ముత్యమల్లే.. మెరిసేపోయే
మల్లె మొగ్గా..ఆ..ఆ

అరె ముట్టుకుంటే.. ముడుసుకుంటావు
..ఇంత సిగ్గా.. ఆ.. ఆ..


మబ్బే..మసకేసిందిలే..పొగమంచే
తెరగా నిలిసిందిలే..

ఊరూ నిదరోయిందిలే..
మంచిసోటే మనకూ కుదిరిందిలే..!

మబ్బే.. మసికేసిందిలే..పొగమంచే
తెరగానిలిసిందిలే..


కురిసే సన్నని వాన.. 
సలి సలిగా వున్నది లోనా..
కురిసే సన్నని వాన.. 
సలి సలిగా వున్నది లోనా..

గుబులౌతుందే.. గుండెల్లోనా..
జరగనా కొంచం.. నేనడగనా లంచం..

చలికి తలలువంచం.. నీ ఒళ్ళే పూలమంచం..
వెచ్చగా వుందామూ..మనమూ..!

హే పైటలాగా.. నన్ను నీవూ..
కప్పుకోవే..!

గుండెలోనా... గువ్వలాగా
వుండిపోవే.....!

మబ్బే మసకేసిందిలే
పొగమంచే తెరగా నిలిసిందిలే..!

పండే పచ్చని నేలా...
అది బీడైపోతే మేలా...

పండే పచ్చని నేలా...
అది బీడైపోతే మేలా...


మనసు కురిస్తే..వయసు తడిస్తే..
పులకరించు నేల..అది తొలకరించు వేళ..

తెలసుకో పిల్లా... నీ బిడియమేల మళ్ళా
ఉరికే పరువమిదీ.. . మనదీ..!

హే...కాపుకొస్తే కాయలన్నీ..
జారిపోవా..ఆ..ఆ..ఆ

జాముకొస్తే..కోర్కెలన్నీ..
తీరిపోవా..ఆ..ఆ..ఆ


మబ్బే మసకేసిందిలే.. పొగమంచే
తెరగా నిలిసిందిలే..!

10, జూన్ 2025, మంగళవారం

Nenu Neekai Puttinanani Song Lyrics - నేను నీకై పుట్టినాననీ సాంగ్ - చంటబ్బాయ్ ( 1986 ) మెగాస్టార్ చిరంజీవి క్లాసికల్ సాంగ్స్

 

చిత్రం : చంటబ్బాయ్ (1986)
సాహిత్యం  : వేటూరి
సంగీతం : చక్రవ ర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల



                                                       









పల్లవి :
నేను నీకై పుట్టినాననీ..
నిన్ను పొందక మట్టికాననీ..
చెమ్మగిల్లే కనులతో.. చేయి పట్టే మనసుతో..
చేసుకున్న బాసలో  ఊసులే... ప్రేమ..!
ఊపిరే ప్రేమ...!

చరణం : 1
నిన్నుచూడక.. నిదరపోనీ.. రెండు నేత్రాలు..!
కలల హారతి.. నీకు పట్టే.. మౌనమంత్రాలు..!
నిన్నుతాకక.. నిలవలేని.. పంచప్రాణాలు..!
కౌగిలింతలా.. గర్భగుడిలో.. మూగ దీపాలు..!
ప్రేమ మహిమ తెలుపతరమా..!
ప్రేమే.. జీవన మధురిమ ॥

చరణం : 2
స్త్రీ  అనే.. తెలుగక్షరంలా.. నీవు నిలుచుంటే..!
క్రావడ ల్లే.. నీకు  వెలుగులా.. ప్రమిదనై ఉంటా..!
ఓం అనే వేదాక్షరంలా.. నీవు ఎదురైతే..!
నాదమై నిన్నాలపించే.. ప్రణవమై ఉంటా..!
ప్రేమ మహిమ  తెలియ తరమా..!
ప్రేమే జీవన మధురిమ ॥


7, జూన్ 2025, శనివారం

pellantune vedekkinde gali Song lyrics - పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి - నారీ నారీ నడుమ మురారి ( 1990) - NBK Classics

చిత్రం : నారీ నారీ నడుమ మురారి ( 1990)

సాహిత్యం : సిరివెన్నెల 

గానం : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, పి సుశీల 

సంగీతం : కె వి మహదేవన్ 



                                              












పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా కంచె దాటింది ఆత్రాల గోల పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి తరిమే తరుణంతో పరువం తడబడుతుంది కులికే చెలి తాపం కుదురుగా నిలబడనంది తరిమే తరుణంతో పరువం తడబడుతుంది కులికే చెలి తాపం కుదురుగా నిలబడనంది మనసే నీకోసం ఏటికి ఎదురీదింది మురిపెం తీరందే నిదురను వెలి వేస్తుంది చెలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ముడులేసే మనువైతే మక్కువ మత్తుగా దిగుతుంది ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా కంచె దాటింది ఆత్రాల గోల పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి సాయం రమ్మంటు ప్రాయం కబురంపింది బిగిసే బంధంలో బంధీ కమ్మంటోంది సాయం రమ్మంటు ప్రాయం కబురంపింది బిగిసే బంధంలో బంధీ కమ్మంటోంది వీచే ప్రతి గాలి వయసును వేధిస్తోంది జతగా నువ్వుంటే పైటకు పరువుంటుంది మితి మీరే మొగమాటం అల్లరి అల్లిక అడిగింది మదిలోని మమకారం మల్లెల పల్లకి తెమ్మంది ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా కంచె దాటింది ఆత్రాల గోల పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి మళ్ళీ వింటే ఏమవుతుందో చూడాలి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి