చిత్రం : చంటబ్బాయ్ (1986)
సాహిత్యం : వేటూరి
సంగీతం : చక్రవ ర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి :
నేను నీకై పుట్టినాననీ..
నిన్ను పొందక మట్టికాననీ..
చెమ్మగిల్లే కనులతో.. చేయి పట్టే మనసుతో..
చేసుకున్న బాసలో ఊసులే... ప్రేమ..!
ఊపిరే ప్రేమ...!
చరణం : 1
నిన్నుచూడక.. నిదరపోనీ.. రెండు నేత్రాలు..!
కలల హారతి.. నీకు పట్టే.. మౌనమంత్రాలు..!
నిన్నుతాకక.. నిలవలేని.. పంచప్రాణాలు..!
కౌగిలింతలా.. గర్భగుడిలో.. మూగ దీపాలు..!
ప్రేమ మహిమ తెలుపతరమా..!
ప్రేమే.. జీవన మధురిమ ॥
చరణం : 2
స్త్రీ అనే.. తెలుగక్షరంలా.. నీవు నిలుచుంటే..!
క్రావడ ల్లే.. నీకు వెలుగులా.. ప్రమిదనై ఉంటా..!
ఓం అనే వేదాక్షరంలా.. నీవు ఎదురైతే..!
నాదమై నిన్నాలపించే.. ప్రణవమై ఉంటా..!
ప్రేమ మహిమ తెలియ తరమా..!
ప్రేమే జీవన మధురిమ ॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి