29, మార్చి 2025, శనివారం

నేనొక ప్రేమ పిపాసిని - సాంగ్ లిరిక్స్ - ఇంద్రధనుస్సు (1978) Indradhanussu - Nenoka Prema Pipasini Song Lyrics

 

చిత్రం : ఇంద్రధనుస్సు ( 1978)

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ 

గానం : ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం

సంగీతం : కె వి మహదేవన్ 










నేనొక ప్రేమ పిపాసిని -  నీవొక ఆశ్రమవాసివి 

నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది 

నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి 

నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది


నేనొక ప్రేమ పిపాసిని..

తలుపు మూసిన తలవాకిటనే..  పగలు రేయి నిలుచున్నా.. 
పిలిచి పిలిచీ బదులేరాక..  అలసి తిరిగి వెళుతున్నా..

 
తలుపు మూసినా తలవాకిటనే పగలు రేయి నిలుచున్నా.. 
పిలిచి పిలిచీ బదులేరాక  అలసి తిరిగి వెళుతున్నా ..


నా దాహం తీరనిది  నీ హృదయం కదలనిది 


నేనొక ప్రేమ పిపాసిని..

పూట పూట నీ పూజ కోసమని...  పూలు తెచ్చాను.. 
ప్రేమభిక్షను పెట్టగలవని...  దోసిలి ఒగ్గాను..

 
నీ అడుగులకు మడుగులోత్తగా..  ఎడదను పరిచాను.. 
నీవు రాకనే.. అడుగు పడకనే..  నలిగిపోయాను

 
నేనొక ప్రేమ పిపాసిని.. 

పగటికి రేయి.. రేయికి పగలు..  పలికే వీడ్కోలు.. 
సెగ రేగిన గుండెకు చెబుతున్నా..  నీ చెవిన పడితే చాలు..

 
నీ జ్ఞాపకాల నీడలలో.. నన్నెపుడో చూస్తావు..
నను వలచావని తెలిపేలోగా..  నివురైపోతాను..

నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది -  నీ హృదయం కదలనిది 


నేనొక ప్రేమ పిపాసిని..



                                                    






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి