ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పల్లవించవా నాగొంతులో..(కోకిలమ్మ) తెలుగు సినీ మధుర గీతాలు : pallavinchava naa gonthulo song ( Kokilamma ) Telugu Movie Melodies

చిత్రం : కోకిలమ్మ(1983)
సంగీతం : ఎం. ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం



                                                            


 

                                                                               

పల్లవి:

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

చరణం:
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే
నాదన్నది ఏమున్నది నాలో
నేవేనాడొ మలిచావు ఈ రాతిని
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

చరణం:
నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా
నా బ్రతుకు నీది కాదా

పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

"సాహసం సేయరా డింభకా..తెలుగు సినీ అగ్రస్థానం లభించునురా" అని ఎన్ టి ఆర్ ని దీవించిన "పాతాళభైరవి" : NTR Patalabhairavi

  విడుదల : 15 మార్చ్ 1951 నటవర్గం : ఎన్ టి రామారావు, ఎస్ వి రంగారావు, రేలంగి, సి ఎస్ ఆర్, కె మాలతి, పద్మనాభం  దర్శకత్వం : కె వి రెడ్డి  నిర్మాతలు : నాగిరెడ్డి, చక్రపాణి  సంగీతం : ఘంటసాల నిర్మాణసంస్థ : విజయా ప్రొడక్షన్స్                    తెలుగు సినీ చిత్ర సీమకు గర్వకారణంగా నిలిచే అతి కొద్ది సినీ  ఆణిముత్యాలలో "పాతాళభైరవి" మొదటి వరుసలో నిలుస్తుంది. కొన్ని వందల చిత్రాలకు ప్రేరణగా నిలిచిన, భవిష్యత్ లో మరెన్నో రానున్న తోటలో  రాముడు - కోటలో రాణి తరహా ప్రేమ కథల ఇతివృత్తానికి  ఊపిరి పోసిన చిత్ర రాజం. మహా నటులు ఎన్ టి ఆర్, ఎస్ వీ ఆర్ లకు తెలుగు చిత్ర లోకంలో మహా ప్రస్తనాలకు నాంది పలికింది. రాజకుమారిని దక్కించు కోవడం కోసం ఎంతటి సాహసానికైనా సిద్దపడే తోట రాముడి పాత్రలో ఎంతో ఎంతో చలాకీగా, అందంగా, వీరోచితంగా నటించి, జానపద కథానాయకుడు అంటే ఎన్ టి రామారావు అనే సుస్థిర స్థానాన్ని ఇచ్చింది. " సాహసం సేయరా డింభక...సంకల్పం సిద్ధించునురా..రాజకుమారి లభించునురా" అన్న డైలాగులతో ఎస్ వీ రంగారావు రక్తి కట్టించిన నేపాళ మాంత్రికుడి ...

తెలుగు సినీ ఆణిముత్యం " దేవదాసు " : All time telugu movie classics : Devadasu

విడుదల : 26 జూన్ 1953 నట వర్గం : అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, సి ఎస్ ఆర్ ఆంజనేయులు, పేకేటి శివరాం  దర్శకత్వం : వేదాంతం రాఘవయ్య  నిర్మాత : డి ఎల్ నారాయణ  నిర్మాణ సంస్థ : వినోదా పిక్చర్స్  సంగీతం : సి ఆర్ సుబ్బరామన్  ఛాయాగ్రహణం : బి ఎస్ రంగ తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాలలో మేటి "దేవదాసు". సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర చటర్జీ నవల దేవదాసు దీనికి ఆధారం. దేవదాసు, పార్వతిల పాత్రలకు ప్రాణం పోసారు అక్కినేని, సావిత్రిల జంట. నాటికి, నేటికి భగ్న ప్రేమికుల కథ అంటే దేవదాసునే ముందుగా గుర్తుకు వచ్చే ఉన్నత స్థాయిలో సినిమాకు జీవం పోసారు దర్శకుడు వేదాంతం రాఘవయ్య.  సినిమా అపూర్వ విజయానికి దేవదాసు, పార్వతిల పాత్రలలో ఎ ఎన్ ఆర్, సావిత్రిల నటన ఎంతగా దోహదం చేసిందో..అంతే స్థాయిలో పాటలు కూడా తోడ్పడ్డాయి. "అంతా భ్రాంతియేనా..జీవితానా వెలుగింతేనా?"..."జగమే మాయ, బ్రతుకే మాయ"..."పల్లెకు పోదాం, పారును చూద్దాం చలో చలో".."కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్"..." ఓ ఓ దేవాదా, ఓ ఓ పార్వతి " .." తానే మారేనా, గుణమ్మేమార...

నాటికీ, నేటికీ కృష్ణ " సింహాసనం " సినిమా ఒక చరిత్ర : Simhasanam Movie Visual Wonder : Superstar Krishna

విడుదల : 21 మార్చ్   నటవర్గం : కృష్ణ (ద్విపాత్రాభినయం), జయప్రద, రాధ, మందాకిని (తొలిపరిచయం) , కాంతారావు, సత్యనారాయణ, గుమ్మడి, అంజాద్ఖాన్ (తొలిపరిచయం), వహీదా రెహ్మన్, ప్రభాకరరెడ్డి , గిరిబాబు మొ,, కథ, దర్శకత్వం, నిర్మాత : కృష్ణ సంగీతం : బప్పీలహరి ( తొలిపరిచయం)  గానం : రాజ్ సీతారం, పి. సుశీల  ఛాయాగ్రహణం : కె  ఎస్ ఆర్ స్వామి  నిర్మాణ సంస్థ : పద్మాలయా స్టూడియోస్                                       తెలుగు సినీ పరిశ్రమలో ధైర్య సాహసాలకు, అనితర సాధ్య ప్రయోగాలకు పెట్టింది పేరు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త హంగులు, ఆదునిక పరిజ్ఞానం అయితేగానీ... నూతన నటీ నటులు, సాంకేతిక నిపుణులు అయితేగానీ పరిచయం చేయడం, ప్రోత్సహించడంలో కృష్ణ ముందు ఉండేవారు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలలో నటించడం, నిర్మించడంలో నిరంతరం తలమునకలుగా ఉండేవారు.  సినిమా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఆయన పేరు చెప్పుకొని భరోసాగా ఉండేవి. తన సినిమ...