చిత్రం :
అంతులేని కథ (1976)
సంగీతం :
ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం :
ఆచార్య ఆత్రేయ
గానం : కె జే ఏసుదాసు
పల్లవి :
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి
ఇక ఊరేల - సొంత
ఇల్లేల
ఇక ఊరేల - సొంత
ఇల్లేల ఓ చెల్లెలా..
ఏల ఈ స్వార్ధం -
ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం -
ఏది పరమార్ధం
చరణం :
నన్నడిగి
తలిదండ్రి కన్నారా..
నన్నడిగి
తలిదండ్రి కన్నారా
నా పిల్లలే
నన్నడిగి పుట్టారా..
పాపం పుణ్యం
నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు
పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది - ఏది
నాది
ఈ భేదాలు.. ఉత్త
వాదాలె ఓ చెల్లెలా..
ఏల ఈ స్వార్ధం -
ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి
చరణం :
శిలలేని గుడికేల
నైవేద్యం..
ఈ కలలోని
సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు
చుట్టూ కంచే ఎందుకు పిచ్చెమ్మా..
కళ్ళులేని కభోది
చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు..
తుదకు మన్ను
ఈ బ్రతుకెంత..
దాని విలువెంత ఓ చెల్లెలా..
ఏల ఈ స్వార్ధం -
ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి
చరణం :
తెలిసేట్లు
చెప్పేది సిద్ధాంతం
అది
తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన
మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా..
నిన్ను నువ్వే
తెలుసుకుంటే చాలును పోవమ్మా..
ఏది సత్యం - ఏది
నిత్యం
ఈ మమకారం -
ఒట్టి అహంకారం ఓ చెల్లెలా..
ఏల ఈ స్వార్ధం -
ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు
వీధి ఒకటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి